బ్రాహ్మణుడుగా డీజే అల్లు అర్జున్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 05:07 PM
 

గత రెండు రోజులుగా బన్నీ నటించే డీజే ఫస్ట్‌ లుక్‌ ఈ 18న విడుదల చేస్తామని చెప్పి నిన్నటి నుండి ప్రీ లుక్‌ అంటూ రోజుకో పోస్టర్‌ ని రివీల్‌ చేస్తున్నారు డీజే చిత్ర యూనిట్‌. అయితే ఆ ప్రీ లుక్స్‌ లో అల్లు అర్జున్‌ ని హైప్‌ చేసి ఎదో రుదక్ష్ర, అడ్డనామాలు, ఓం అనే పేర్లు మాత్రమే విడుదల చేశారు. ఈ ప్రీ లుక్స్‌ తోనే సినిమాపై అంచనాలు పెంచగలిగారు. అసలు డీజెలో బన్నీ రెండు రోల్స్‌ లో కనిపిస్తాడని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఇక బన్నీ గెటప్‌ ఎలా వుండబోతుందనే మీద చాలా ఎక్సపెక్ట్షన్స్‌ ఉన్నాయి. అయితే మరో వైపు ఈ సినిమాలో బన్నీ పాత్రలు అదుర్స్‌ లో ఎన్టీఆర్‌ పాత్రలతో పోలిక వుంటుందనే ప్రచారము మొదలైంది. అందులో ఎన్టీఆర్‌ ఒక పాత్రలో బ్రాహ్మణుడుగా కనిపిస్తాడు. ఇక డిజెలో కూడా అల్లు అర్జున్‌ ఒక బ్రాహ్మణ పాత్ర చెయ్యబోతున్నాడని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా నిన్న, ఈరోజు వదిలిన ప్రీ లుక్స్‌ లో రుదక్ష్ర, అడ్డనామాలు, ఓం అనే గుర్తులు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక బ్రాహ్మణుడిగా అల్లు అర్జున్‌ ఎలా వుండబోతున్నాడో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో మొదలైంది.


ఇకపోతే రేపు ఎలాగూ అల్లు అర్జున్‌ డీజే ఫస్ట్‌ లుక్‌ వచ్చేస్తుంది అదెలా ఉండబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైములో ఇప్పుడు అల్లు అర్జున్‌ నటించే డీజే వర్కింగ్‌ ఫోటో ఒకటి నెట్‌ లో లీకైంది. ఆ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తాండవం చేస్తుంది. ఆ ఫోటో లో అల్లు అర్జున్‌ బ్రహ్మణుడిగా కనిపిస్తున్నాడు. బ్రాహ్మణుడిలా పంచెకట్టు, నామాలు, ఒళ్ళంతా విభూదితో అల్లు అర్జున్‌ ని చూస్తుంటే అచ్చమైన బ్రాహ్మణుడు ఇలానే ఉంటాడా అనేలా కనిపిస్తున్నాడు. మరి ఇప్పటి వరకు సినిమా గురించి ఏ విషయము బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్న అల్లు అర్జున్‌ ఇలా తన లుక్‌ నే ఎవరో మీడియాకి లీక్‌ చేశారనే దానిమీద ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక అల్లు అర్జున్‌ డీజే బ్రాహ్మణ లుక్‌ మాత్రం ఇప్పుడు సోషల్‌ మెడిలో వైరల్‌ పాకిపోయింది.