ఈ పాటలు చరిత్రలో నిలిచిపోతాయి - ఆర్‌ పి పిట్నాయక్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 04:51 PM
 

 పి డి రాజు ప్రధాన పాత్రల్లో సువర్ణ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జె జాన్‌ బాబు దర్శకత్వంలో , టి సుధాకర్‌ బాబు నిర్మాతగా నిర్మిస్తున్న తొలి కిరణం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు ఆర్‌ పి పట్నాయక్‌ మాట్లాడారు.


ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం ఇవ్వాలని అనుకున్నారు?


చాలా మంది అల్బమ్‌ను తయారు చేస్తారు. కొన్ని అల్బమ్స్‌ విన్ని మరిచి పోతారు. మరి కొన్ని విని మరిచిపోతారు. దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈ చిత్రానికి సంగీతం ఇవ్వమన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే అల్బమ్‌ని ఇవ్వలని అనుకున్నాను.


దర్శకుడికి ఎలాంటి కండిషన్‌ పెట్టారు?


దర్శకుడు జాన్‌బాబుకి ఒక కండిషన్‌ పెట్టాను. బైబుల్‌లో పదాలు కఠినంగా ఉంటాయి. అలా కఠిన పదాలు కాకుండా మనం మాట్లాడే పదాలు పెడదాం అని దర్శకుడికి చెప్పాను. అప్పుడు అందరికి రిచ్‌ అవుతుంది. 


పాటలు రాసింది ఎవరు?


క్రిష్టియన్‌ పదాలు రాకుండా సంగీతాన్ని కంపోజ్‌ చేశాం. ఈ చిత్రానికి అరు పాటలు చంద్రబోస్‌ రాశారు. జీస్‌క్రిస్త్‌ గుర్చి ప్రతి ఒక్కరు తెలిసుకోనలా , అర్ధమైన రితిలో సంగీతాన్ని ఇచ్చాం. 


మీరు ఎన్ని పాటలు పాడారు?


ఈ చిత్రంలో రెండు పాటలు నేను పాడాను. వాటిని రిలీజ్‌ కూడా చేశాం. మిగితా వాటికి ట్యూన్‌ ఇచ్చి రికార్డ్‌ చేశాం. 


ఈ చిత్రం రిలీజ్‌ ఎప్పుడు?


టాకీ అంతా షూటింగ్‌ పూర్తి అయింది. సాంగ్‌లను చిత్రీకరణ చేయాలసి ఉంది. త్వరలో రిలీజ్‌ చేస్తాం. 


మీరు ఏ దేవుడ్ని ఇష్టపడతారు?


దేవుడికి కలం లేదు. నేను హిందువును, అందరి దేవుళ్లు అన్న ఇష్టమే. నా ఫస్ట్‌ నా తల్లి దండ్రుల తరువాత మిగతా దేవుళ్లు. 


ఈ సినిమా ఎలా ఉంటుంది?


ప్రతి 12 ఏళ్లు తరువాత ప్రేక్షకుల్లో టెస్ట్‌ మారుతుంటుంది. కరుణామయుడు చిత్రం తరువాత ఈ చిత్రం తొలి కిరణం పెద్ద హిట్‌ అవుతుంది. 


మీరు దర్శకత్వం వహించే చిత్రం ఎప్పుడు?


మనలో ఒక్కడు త్వరలో చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. దీని గుర్చి తరువాత చెప్పుతాను. 


పెద్ద హీరోలతో మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?


నేను రెండు కథలను తయారు చేశాను. ఒక్కటి 8పాటలతో మ్యూజికల్‌ మూవీ ని తీస్తాను, పెద్ద హీరోలు ఇద్దరికి కథ చెప్పాను. ఎవరు ఓకే అంటే వారితో సినిమా చేస్తాను.