మామయ్య ప్రోగ్రాంను చూస్తూ అలాగే ఉండిపోయా...

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 04:28 PM
 

హైదరాబాద్: 'స్టార్ మా' టీవీలో మెగాస్టార్ చిరంజీవి సందడి ప్రారంభమైంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంను చిరంజీవి హోస్ట్ చేస్తున్నారు.  గతంలో మూడు సీజన్ల వరకు అక్కినేని నాగార్జున యాంకర్ గా వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా నాలుగో సీజన్ కు హోస్ట్ గా చిరంజీవి వచ్చారు. చిరంజీవి హోస్టింగ్ కు ప్రేక్షకుల్లో అనూహ్యమైన స్పందన వస్తోంది. అంతేకాదు, ఆయన హోస్టింగ్ పట్ల ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు హోస్టింగ్ పై ఆయన కోడలు ఉపాసన కూడా స్పందించింది. "మామయ్య చిరంజీవి హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ఇప్పుడే చూశా. ఆ ప్రోగ్రాంను చూస్తూ, టీవీకి అలాగే అతుక్కుపోయా" అంటూ ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు, ప్రోంగ్రాంకు సంబంధించిన చిరంజీవి ఫొటోలను కూడా అప్ లోడ్ చేసింది.