24న కేరాఫ్‌ గోదావరి

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 04:19 PM
 

రోహిత్‌, శృతివర్మ హీరో,హీరోయిన్‌గా , ఉషా మూవీస్‌ సమర్పించు, ఆర్‌ ఫిల్మ్‌‌స ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్‌ , బామ్మన ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజా రామ్మోహన్‌ చల్లా దర్శకత్వంలో తూము రామారావు , బొమ్మన సుబ్బరాయుడు,రాజేష్‌ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్న కేరాఫ్‌ గోదావరి చిత్రం అన్న కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 24న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా రఘు కుంచె మాట్లాడుతూ గోదావరి అంటేనే వేటకారం, అభిమానం, మర్యాద అని రకాలుగా ఉంటాయి. సంగీత దర్శకుడులు సత్యం,ఇళయరాజా, వంటి వారు గోదావరి మీద పాటలు రాశారు. ఇప్పుడు కొత్తగా గొదావరి మీద  చెప్పెది లేదు.  అయిన గొదావరి మీద ఒక పాట పెట్టాం. ఆ పాటను బాస్కర బట్ల రాశాడు. ఈ చిత్రం సక్సెస్‌ కావాలి అన్నారు. నటి మధుమతి మాట్లాడుతూ రఘు కంచె గారు చెప్పెనట్లు కథ హీరో. స్వచ్చమైన కథ. గొదావరిలో జరిగే సన్నివేశాలు చక్కగాచూపారు. దర్శకుడు మోహన్‌ గారు ఫస్ట్‌ చిత్రమైన బాగా తీశారు. చిత్రం మంచి విజయం సాధించాలి అన్నారు. నిర్మాత రామారావు మాట్లాడుతూ అన్ని హంగులతో పూర్తి చేసుకుని ఫిబ్రవరి 24న వస్తుంది. సెన్సార్‌ పూర్తి అయింది. కామెడి ,ఎమెషనల్‌ కథ,రఘు కంచె గారు మంచి సంగీతాన్ని అందించారు అన్నారు. దర్శకుడు  రాజా రామ్మోహన్‌ చల్లా  మాట్లాడుతూ కేరాఫ్‌ గోదావరి ఇవివి కామెడిలా ఉంటుంది. రఘు కంచె మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాతలు నాకు పూర్తి స్వచ్ఛను ఇచ్చారు. హీరో,హీరోయిన్‌ లు కొత్త వారైన అనుభవం ఉన్న వారిలా నటించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు.