సునీల్,మీయా జార్జీ హీరో,హీరోయిన్గా, యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, పరుచూరి కిరిటీ నిర్మాతగా నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్నది. సునీల్‌పై పాటను చిత్రికరణ అన్నపూర్ణ ఏడు ఎకరాల స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా హీరో సునీల్ మాట్లాడుతూ ఉంగరాల రాంబాబు అనే టైటిల్ వింటుంటే ఎంత ఫన్నిగా ఉందో సినిమా ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు అంతే ఫన్ ఉంటుంది. ఒకప్పుడు సీనియర్ నటుడు చలంగారి సంబరాల రాంబాబు అనే టైటిల్లా ఎంతో బావుందని నా స్నేహితులు కొంత మంది ఫోన్ చేసి చేప్పారు. క్రాంతి మాధవ్ వంటి మంచి స్ట్రెంగ్త ఉన్న దర్శకుడితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్స్ తరహాలో ఈ చిత్రం లో నా క్యారెక్టర్ ఉంటుంది. అందాల రాముడు, పూల రంగడు చిత్రాల తరహాలో ఎంజాయింగ్ ఉంటుంది. ఐదారు రోజుల మినహా షూటింగ్ మొత్తం పూర్తియ్యింది. ఈ రోజు ఈ పాటతో చిత్రీకరణ పూర్తి అవుతుంది. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. హీరో చిన్న పిల్లాడి వంటి మనస్తత్వం ఉండే మంచి అబ్బాయి. జాతకాలను నమ్మే క్యారెక్టర్. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో పాటలన్నీ పూర్తి అయ్యాయి. ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ అంతా పూర్తి అయింది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. అవుటండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సునీల్‌గారు చక్కటి కామెడిని పండించారు. పాత్ర కోసం బరువు కూడా పెరిగాను. ఒకప్పుడు తనదైన కామెడి తో ప్రేక్షకులను నవ్వించిన సునీల్‌ను నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ చిత్రంలో చూపించాను. హీరో క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. డిఫరెంట్ కామెడి అన్నారు.