ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం భూముల అంశంపై సీఎంం సమీక్ష

Andhra Pradesh Telugu |  IANS  | Published : Fri, Apr 14, 2017, 01:02 AM

వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి  : న్యాయ స్థానంలో వున్న సింహాచలం భూముల వ్యవహారం గురించి అధికారులు శ్రద్ధ తీసుకుని వెంటనే ఈ వివాదానికి ముగింపు పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం దేవాదాయ శాఖ సమీక్షలో ఈ అంశ ంపై ప్రత్యేకంగా అడ్వకేట్‌ జనరల్‌ శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయస్థానంలో సమర్ధ వాదనలు వినిపించాలని సూచించారు. న్యాయస్థానానికి వేసవి సెలవలు రానున్న దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా ఈ సమ స్యకు పరిష్కారం లభించేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. 12 వేల మందికి సంబంధించిన ఈ వ్యవహారంలో వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుం దన్నారు. రాష్ట్రంలోని 3 ప్రధాన దేవస్థానాల్లో అమ లుచేయాల్సిన మాస్టర్‌ ప్లాన్‌ గురించి ఈ సమావే శంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ముఖ్యంగా మహిమాన్విత  జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశై లాన్ని తిరుపతితో సమానంగా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలని ముఖ్య మంత్రి దేవాదాయశాఖకు సూచించారు. దేవాల యాల జీర్ణోద్దరణ, అభివృద్ధి పనులలో ఆయా ఆలయ ప్రాశస్థ్యాలు, చరిత్ర, సంస్కృతి దెబ్బతి నకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించు కోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయాల అభివృద్ధి కోసం పేరొందిన అంతర్జాతీయ రూప శిల్పుల సహాయం తీసుకోవాలని చెప్పారు. సున్నిపె ంటలో ఏర్పాటుచేయబోయే టౌన్‌ షిప్‌ ద్వారా అక్కడ వున్న ప్రజల ఆర్థిక శక్తి సామర్ధ్యాలు పెంపొం దించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్కడ నిర్మించబోయే 7 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి అక్కడి వారి ఆర్థిక స్థితిగతులను మార్చగ లదన్నారు. రహదారి లోపలిభాగంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తగిన వాతావరణం కల్పించాలన్నారు. మహాశివునికి సంబంధించిన పూజాదికాలు, భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ ప్రాంతం నెలవు కావాలన్నారు. దుర్గ గుడి ఘాట్‌ రోడ్డు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీయం చెప్పారు. కుమ్మరిపాలెెంలో ఏర్పాటుచేస్తున్న పార్కి ంగ్‌ లాట్‌ను అక్టోబరులోగా సిద్ధం చేయాలని ఆదే శించారు. ఇంద్రకీలాద్రిని ఆక్రమణల బారీనుంచి కాపాడుకోవాలని, అటవీశాఖతో కలిసి ఫెన్సింగ్‌ ను ఏర్పాటుచేసుకోవాలని దేవాదాయశాఖకు సూచిం చారు. శ్రీకాళహస్తి మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధిలో ఎదు రవుతున్న భూసేకరణ సమస్యల్ని అధిగమించాలని సీయం చెప్పారు. ఖర్చు పెరిగినా ప్రజలకు మేలు జరగాలని, ప్రభుత్వానికి మంచిపేరు రావాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ముఖ్య కార్యదర్శి జె.ఎస్వీ ప్రసాద్‌, కమిషనర్‌ అనురాధ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com