రవాణా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 14, 2017, 12:37 AM
 

  ఒంగోలు, మేజర్‌న్యూస్‌ : రవాణాశాఖలో పారదర్శకత, జవాబుదారితనానికి పెద్ద పీట వేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని ఉప రవాణా కమిషనర్‌  వారి కార్యాలయంలో మంత్రి సీసీ కెమెరాలను రిమోట్‌తో స్వీచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధారాఘవరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాంకేతిక పరిజ్క్షానాన్ని పరి పూర్ణంగా వినియోగించుకుంటున్నామని, ఈ ప్రగతి ద్వారా ప్రతీ కార్యక్రమంలో ఎంతో వేగంగా ముందుకెళు తున్నా మన్నారు. రవాణా శాఖలో పారదర్శకత, జబాబుదారితనం పెంచే దిశగా ప్రస్తుత ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయ ప్రాంగణంలోకి ఎవరు వస్తున్నారు... ఎవ్వరు ఏమి చేస్తున్నా... ఉన్నతాధికారులు ఉన్నారా.... లేదా... పరిపాలన సజావుగా సాగుతుందో లేదో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతా యన్నారు. ఎక్కడైనా తేడాలున్నా వాటిని వెంటనే సరి చేసుకునేందుకు కూడా ఉపయోగపడతాయన్నారు. 


   ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డిటిసి సుబ్బారావు, ఎంవీఐలు గోపి నాయక్‌, లాల్‌, ఏఎంవిఐ మధుసూదన్‌, అంకమరావు, ఏఓలు సుశీల, లవ కుమార్‌ తదితర రవాణా శాఖా సిబ్బంది ఉన్నారు.