9వ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రులు

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 01:27 PM
 

న్యూఢిల్లీ: ఢిల్లీలో 9వ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రులు సురేశ్‌ ప్రభు, హర్షవర్ధన్‌, అనిల్‌ దవే ప్రారంభించారు. సెప్టెంబర్‌ 8 వరకు సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ పర్యటన కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో 19 వేల కి.మీ. సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించనుంది. 16 ఏసీ కోచ్‌లలో పర్యావరణ మార్పుల అంశంతో సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. చెట్ల సంరక్షణ, భూతాపం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు. కొత్తవలస, గుడివాడ, కల్లూరు, కోడూరు, మిర్యాలగూడలో సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించనుంది.