జ్యోతిభాపూలే ఆదర్శం కావాలి

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 12, 2017, 12:49 AM
 

    సూర్యప్రతినిధి, ఒంగోలు : బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు   జ్యోతిబాపూలే అని రాష్ట్ర అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. మహాత్మ జ్యోతిబాపూలే 191 జయంతిని పురష్కరించుకోని మంగళవారం ఉదయం నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్‌ వద్ద గల జ్యోతిబాపూలే విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌, జిల్లా అధికారులు  పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


 అనంతరం రామనగర్‌ ఒకటో లైన్‌లో ఉన్న రైస్‌మిల్లర్‌ అసోసియేషన్‌ హాల్లో జరిగిన సభలో ముఖ్య అతిథిగా మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొన్నారు.  ముందుగా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మ గాంధీజీ కంటే ముందుగా పేద వర్గాల కోసం పోరాటం చేసిన మహానేత పూలే అని కొనియా డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ర్ట బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలను బిసిలకు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో బిసిల అభ్యున్నతికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. బిసీ విద్యార్ధులు విదేశీ విద్య కోసం ఎన్‌.టి.ఆర్‌ విదేశీ విద్యాధరణ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పూలే జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించా లని, వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బిసి సంఘాల విజ్క్షప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లాలో బిసీల అభివృద్ధి కోసం ఇప్ప టికే రూ. 11 కోట్ల రూపాయల ఋణాలను మంజూరు చేశామన్నారు. బిిసీ భవన్‌ నిర్మాణానికి నిధులు  తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. 


  ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మాట్లాడుతూ బిసీ కులాలు, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతి బాపూలే అన్నారు. మహారాష్టల్రో జన్మించి మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి తన సతీమణి సావిత్రిబాబు పూలేకు విద్య నేర్పించి మహిళా పాఠశాల నిర్వహణకు ఆధ్యులైన్నారన్నారు. బిసీ భవన్‌ నిర్మాణానికి త్వరలోనే  శంఖు స్థాపన చేస్తామన్నారు. బీసీ ఆరామ క్షత్రం ఏర్పాటు చేసి బిసిలకు గదులు కేటాయిస్తామన్నారు. 


   సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడారు. ముందుగా సాయి నాథ నాట్య కళా భారతి ఆధ్వర్యంలో చిన్నారు లు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం ఎన్టీఆర్‌ విదేశీ విద్యాధరణ పథకం క్రింద 13 మందికి రూ 65 లక్షల బ్యాంకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే 29350 మంది విద్యార్థు లకు రూ. 10.16 కోట్ల బ్యాంకు చెక్కును, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 761 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ 25.60 కోట్ల బ్యాంకు చెక్కును, మెప్మా ద్వారా 310 ఎన్‌హెచ్‌ జి మహిళలకు రూ .11.10 కోట్ల బ్యాంకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌, బాలాజీ, బిసి కార్పొరేషన్‌ ఇడి నాగేశ్వరరావు, బిసి సంక్షేమ అధికారి లక్ష్మీ దుర్గ, డిఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు మురళీ, పోలప్ప, అన్నపూర్ణ, ఆర్‌డివో శ్రీనివాసరావు, డిఎస్‌పి శ్రీనివాసరావు, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి రవి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీ సుధ, బిసి నాయకులు ఉన్నారు.