1.25 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పట్టేసిన టెక్కీ

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 12:55 PM
 

ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ఒకరు రికార్డు స్థాయి వేతనంతో ఉద్యోగం సంపాదించడం టాక్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అయింది.  సిద్ధార్థ్ ఢిల్లీలోని ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. ఉబెర్ టెక్నాలజీస్ లో వారం రోజులు ఇంటర్న్ షిప్ చేసిన సిద్ధార్థ్... అదే సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇంటర్వ్యూలో కష్టసాధ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చి బోర్డును మెప్పించాడు. దీంతో 1.25 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం చేసేందుకు శాన్ ఫ్రాన్సిస్కో రావాలంటూ సిద్ధార్థ్ కు ఉబెర్ టెక్నాలజీస్ ఆహ్వానం పంపింది.