ఉత్తరప్రదేశ్‌లోని బందాలో విషాదం

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 10:22 AM
 

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బందాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో విద్యుత్‌షాక్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లల్లో ఒక చిన్నారి సజీవ దహనమైంది. మరో నలుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.