అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ సస్పెండ్

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 12:49 PM
 

చెన్నై: సమసిపోయిందనుకున్న తమిళ రాజకీయ సంక్షోభం మళ్లీ మొదలైంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తున్నట్లు మధుసూధనన్ సంచలన ప్రకటన చేశారు. ఆమెతో పాటు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్, వెంకటేశ్‌ను కూడా పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కు శశికళకు లేదని, పార్టీ నిర్వహణ అంతా ప్రిసీడియం చైర్మన్ అయిన తన ఆధీనంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు.