ఏపీ ప్రభుత్వం ఇచ్చే రేషన్‌లో పంచదార,కిరోసిన్‌ కట్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 12:52 AM
 

కర్నూలు,సూర్యప్రతినిధి: పేద ప్రజలకు నిత్యావసరాలు అందించే ప్రధాన లక్ష్యంతో పనిచేసే పౌర సరఫరాలశాఖ నుంచి ఒక్కో వస్తువునే రద్దు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పంచదారకు తమ వంతు సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మే నుంచి చక్కెర నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 100 శాతం గ్యాస్‌ కనెక్షన్‌ను అమలు చేసి జూన్‌ లేదా జులై నెలల నుంచి కిరోసిన్‌ు కూడా తీసేయాలనుకుంటోంది. ప్రజాసాధికర సర్వే ఆధారంగా కిరోసిన్‌ తొలగి ంపునకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. పంచదార, కిరోసిన్‌ల ఉ త్పత్తులు తక్కువ కావడంతో ధరలు పెరిగిపోయాయి.


దీంతో వీటి పంపిణీకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వానికి భారమైంది. దీంతో ఆ బరువు నుంచి వైదొలగాలని కేంద్రం భావించింది. కేంద్రం సబ్సిడీ ఇవ్వనప్పుడు తనకేం బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం అను కుందేమో మరి ఏకంగా పౌర సరఫరాల విభాగం నుంచే ఆ రెంటినీ తీసేద్దామను కుంటోంది. దీని వల్ల పంపిణీ చేయడం భారంగా మారింది. జిల్లాలో ఈ రెండు వస్తువులను పంపిణీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,94,32,335 


సబ్సిడీ భరించాల్సి ఉంటుంది.జిల్లాలో 10,76,699 కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు 5,38,349 కిలోల పంచదార జిల్లా కోటాగా వస్తోంది. ప్రతి కార్డుకు అర కిలో పంచదార పంపిణీ చేస్తున్నారు. అర కిలో పంచదారను రూ.13.25 పైసలు సబ్సిడీ భరిస్తూ కార్డుదారులకు రూ.6.75 పైసలకు కార్డుదారులకు ఇస్తున్నారు. అంటే కిలో పంచదారకు కేంద్ర ప్రభుత్వం రూ.26.50 పైసలు భరిస్తోంది. ఈ లెక్కన చూస్తే చౌక దుకాణాల్లో అర కిలో పంచదార బయట మార్కెట్‌లో ధర రూ.20 పలుకుతోంది. కేం ద్రం పంపిణీ చేయకపోతే ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. ఈ లెక్కన చూస్తే జిల్లాకు ప్రతి నెల ఒక్క పంచదారకే రా ష్ట్ర ప్రభుత్వం రూ.1,42,66,249 సబ్సిడీని భ రించాల్సి వస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా భరించి వినియోగదారులకు పంచదార అందించే సాహసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా?


మే లేదా జూన్‌ నెలల్లో కిరోసిన్‌ను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. జిల్లాకు నెలకు కిరోసిన్‌ 1480. 358 కిలో లీటర్లు కోటా కేటాయిస్తున్నారు. ఎల్‌పీజీ/దీపం కనెక్షన్లేని కార్డుదారులకు కార్పొరేషన్‌ పరిధిలో 4 లీటర్లు, ఇతర ప్రాంతాలలో 2 లీటర్ల చొప్పున ఎల్‌.పి.జి/దీపం కనెక్షన్‌ల కార్డుదారులందరికీ 1 లీటరు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఒక లీటరు కిరోసిన్‌కు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి రూ.15, ఎల్‌పీజీ కనెక్షన్‌ కల్గిన వారు రూ.19 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ. 2,51,66,086 నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాల్సి వస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలో కార్డుకు 4 లీటర్ల కిరోసిన్‌ పంపిణీ చేయగా మార్చి నెల నుంచి 2 లీటర్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. త్వరలో కిరోసిన్‌పై వేటు వేస్తున్నారనడానికి ఇది 


నిదర్శనం .దేశంలోనే కిరోసిన్‌ సబ్సిడీ తీసుకోని రాష్ట్రంగా ఏపీనే. రాష్ట్రంలో ప్రజాసాధికర సర్వే ఆధారంగా 25 లక్షల నుంచి 30 ల క్షల మంది గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారిగా గుర్తించారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబాని కి గ్యాస్‌కనెక్షన్‌ లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 35 వేల దీపం కనెక్షన్‌ కోసం దరఖాస్తులు వచ్చాయి. అందులో బీపీసీఎల్‌ 20 వేలు, హెచ్‌పీసీ 8 వేలు, ఐఓసీ 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని ఆర్‌డీవోలను, పౌర సరఫరాలశాఖ డీఎస్‌వోను ఇటీవల జరిగిన మండలస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశించారు.