ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదవాడు ఇసుకను ఉచితంగా పొందేందుకు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 12:25 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : జిల్లాలో పేదవాడికి కావాల్సిన ఇసుకను ఉచితం గా పొందేందుకు ఆధికారులందరు సహాయ సహాకారాలు అందించా లని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ బాబు ఎతో కలసి సోమవారం జిల్లా ఆధికారులతో మంత్రి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. మారుతున్న ఉష్ణో గ్రతలు వాతావరణ మార్పుపై ఇస్రో తీసుకువచ్చిన వరుణ్‌ యాప్‌ ఆధికా రులతోపాటు ప్రజలకు ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. ఈ యాప్‌ వల్ల గ్రౌండ్‌ వాటర్‌, టెంపరేచర్‌, హ్యుమిడిటి, ఫోర్‌కాస్ట్‌లపై వారం రోజు లకు సరిపడా సమాచారాన్ని ఇస్రో సహాకారంతో అందుబాటుల్లోకి వస్తుం దన్నారు. జిల్లాలో పామర్రు, తోట్లవల్లూరు, నందిగామ ఎమ్మార్వోలతో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేదవారికి ఇసుక ఉచితంగా ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ఫ్రీ శాండ్గ ఫాలసీ తీసుకువచ్చిందని, ఆధికారులు కూడా ఇసుక మాఫీయాని అడ్డుకుని పేదవాడికి అందించాలన్నారు. అదే విధంగా హౌసింగ్‌ పై రివ్వులో ఎన్‌.టి.ఆర్‌ హౌసింగ్‌ క్రింద జిల్లాలో 10,588 ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అవనిగడ్డ ఏరియాకు 1614, నందిగామ 324, జగ్గయ్యపేట350, పామర్రు950, గుడివాడ690, పెడన480, కైకలూరు680, గన్నవరం1008, నూజివీడు1640, తిరువూరు936, మైలవరం983, పెనమలూరు526 ఇళ్లు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్‌ యోజన క్రింద కొన్ని ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీపం కనెక్షన్‌ క్రింద జిల్లాలో 70 వేల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్‌ బాబు ఎ మంత్రికి వివరించారు. వంద ఎకరాలలో అమరావతి రాజధాని ఏరియాలో సృ్మతి వనం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ప్రతి మండలం నుంచి దళిత సంఘాలను, యూత్‌ ఆర్గనైజేషన్‌ని, నేతలు వచ్చే విధంగా ఆధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ  పధకం పై జిల్లా కలెక్టర్‌ బాబు.ఏ సమీక్షించారు. అంగన్‌వాడి సెంటర్స్‌కి 201617లో 180 భవనాలు నిర్మించగా, 2017-18 లో 267 భవనాలు జిల్లాకు మంజూరు అయ్యాయ న్నారు. వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇంజనీరింగ్‌ ఆధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయంట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు, డీఆర్‌వో రంగయ్య, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణకుమారి, హౌసింగ్‌  పీడీ వి.శరత్‌కుమార్‌, డీటీసీ మీరా కుమార్‌, డ్వామా పీడీ, ఆర్‌డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com