మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకోండి

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 12:24 AM
 

  నరసాపురం, మేజర్‌న్యూస్‌ : సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాల యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమం డివిజన్‌లోని పలు గ్రామాల నుండి ప్రజలు ఇచ్చిన 21 పిర్యాదులను  స్వీకరించామని కార్యాలయ ఏఓ టి.రాధిక తెలి పారు. వచ్చిన పిర్యాదులను పిర్యాదులను పరిశీలించి పరిష్కరించా ల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని ఆమె తెలిపారు. తన స్ధలమును ఆక్రమించుకుని సరిహద్దుల వారు ఇబ్బందులు పెడుతున్నారని ,వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని తూర్పుతాళ్ళు నుండి ఆర్‌.రామకృష్ణ,  తాను ఇంటిలో లేని సమయంలో నా ఇంటి పై తాటిఆకులు తొలగించి దౌర్జన్యం చేస్తున్నారని  భీమ వరం మండలం గూట్లపాడు నుండి తిరుమాని గోవిందరావు తదితర సమస్య లపై పిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.మురళీకృష్ణ , డివిజనల్‌    కోపరేటీవ్‌ అధికారి ఎస్‌.మురళీకృష్ణ, , డిఇ ఎలక్ట్రికల్‌ పి.వెంక టేశ్వరావు, డిపిఆర్‌ఓ ఎం.భాస్కరనారాయణ, డిప్యూటి సర్వేయర్‌ పాల్గొన్నారు.