వ్యక్తిత్వ నిర్మాణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం: దత్తాత్రేయ

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 12:45 PM
 

హైదరాబాద్‌: వ్యక్తిత్వ నిర్మాణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి సన్మాన కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడారు. సబ్‌కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారని చెప్పారు. భారత మాత కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండేవారికే పద్మ పురస్కారాలు దక్కేవని తెలిపారు. ఈ సారి ఏలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఉన్నవారికే ప్రకటించారని పేర్కొన్నారు.