పళనికి పట్టం

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 02:58 AM
 

-తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం


-తన మంత్రివర్గం వివరాలు ప్రకటించిన పళనిస్వామి  


-31 మందితో పళని మంత్రివర్గం


 -అత్యధికులు శశికళ వర్గమే  ఎక్కువ మంది దేవర్‌ కులస్థులే  శనివారమే బల నిరూపణ


 -యకు ఐదుగురు విశ్వాసపాు్తల్రలో ఒకరు పళనిస్వామి  


 -బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చిన గవర్నర్‌  


 -అన్ని రోజులు అక్కర్లేదన్న పళని  వెంటనే ఎమ్మెల్యేలంతా గోల్డెన్‌ బే రిసార్టుకు తరలింపు 


 -మరోసారి క్యాంపు రాజకీయాలు మొదలు  ఎమ్మెల్యేలు చేజారి పోకూడదనే 


 -నేడు ఉదయం శశికళను కలవనున్న ముఖ్యమంత్రి పళనిస్వామి?


చెనై్న : తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామితో రాజ్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న మరి 30 మంది నేతలతో కూడా విద్యాసాగర్‌ రావు ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ కార్యక్రమానికి పళనిస్వామి వర్గ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. మరో వైపు పలువురు మంత్రుల బంధువులు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించ డానికి అక్కడకు వచ్చారు. ఎట్టకేలకు తమకే అధికారం దక్కడంతో శశికళ వర్గీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయా లని తమకు రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నుంచి ఆహ్వా నం వచ్చిన నేపథ్యంలో అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి తన కేబినెట్‌లోని మంత్రుల వివ రాలను వెల్లడించారు. ఆర్థిక, హోమ్‌ శాఖలను పళనిస్వామి తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక స్కూల్‌ ఎడ్యుకేషన్‌, క్రీడా శాఖ మంత్రిగా సెంగొట్టియన్‌,  సమాచార శాఖ మంత్రిగా కడంబుల్‌ రాజు, చేనేత శాఖ మంత్రిగా కోదండపాణి, పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాలకృష్ణా రెడ్డి, విద్యా శాఖ మంత్రిగా అలెగ్జాండర్‌, అటవీ శాఖ మంత్రిగా శ్రీనివాసన్‌లను నియమించనున్నట్లు ఆయన గవర్నర్‌కు పంపిన నివేదికలో తెలియజేశారు. కాగా, అసెంబ్లీలో 15 రోజుల లోపు బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సూచించిన మేరకు పళనిస్వామి వచ్చే సోమవారమే బల నిరూపణకు సిద్ధమని తెలిపారు. 


తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న ఆయన నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లో అన్నా డీఎంకే పార్టీలో అడుగుపెట్టారు. క్రమక్రమంగా ఎదిగారు. అమ్మ జయలలితకు నమ్మినబంటుగా మారారు. అయితే, జయలలితకు విశ్వాసపాత్రులు అనదగిన వారిలో మొత్తం ఐదుగురు ఉండేవారట. వారిలో పన్నీర్‌ సెల్వం, నాథమ్‌ ఆర్‌. విశ్వనాథన్‌, వి. వైద్యలింగంతో పాటు పి. పళనియప్పన్‌ కూడా ఉన్నారు. ఈ ఐదుగురు జయలలితకు అండగా ఉంటూ పార్టీని నడిపించడంలో ముందు ఉండేవారని సమాచారం. పార్టీ తరƒఫున రాజకీయ పొత్తుల వ్యవహారాన్ని పళనిస్వామి చూసుకునేవారని, జయలలిత ఆదేశాల మేరకు తమ మిత్ర పక్షాలతో చర్చలు జరిపేవారని సమాచారం. గత ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పన్నీర్‌ సెల్వంను పక్కనపెట్టి పార్టీలతో పొత్తు వ్యవహారంపై చర్చల బాధ్యతను పూర్తి స్థాయిలో పళనిస్వామికే జయలలిత అప్పగించారట. పార్టీ కార్యకలాపాల్లో పళనిస్వామి విజయం సాధించడానికి ఆయన వెనుక తన సామాజిక వర్గం వారు ఉండడమేనని సమాచారం. పళనిస్వామి గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, జయలలిత మంత్రివర్గంలో ఒక్కసారిగా వేటు పడని తక్కువ మంది మంత్రులలో ఆయన కూడా ఉండడం.


తమిళనాడులో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం బల నిరూపణకు గవర్నర్‌ విద్యాసాగరరావు 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎంకే శాసనసభా పక్ష నేత స్టాలిన్‌ మండిపడ్డారు. మరీ అంత సమయం ఇస్తే బలం నిరూపణ కష్టం కాదని, త్వరగా బల నిరూపణ జరిగేలా చూడాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ఈ నెల 20న బల నిరూపణ చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి, బల నిరూపణకు మధ్య మూడు రోజులే గడువు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన జాబితా కూడా సమర్పించారు. కాగా, పన్నీర్‌ సెల్వం పంచన చేరిన ఎమ్మెల్యేలలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పళనిస్వామికి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 8 మంది, ఐయుఎంఎల్‌ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. వీరంతా కలిసినా 98 మంది ఎమ్మెల్యేలే అవుతున్నారు. ఒకవేళ పన్నీర్‌ వర్గం డీఎంకేకు మద్దతు ఇచ్చినా అధికారం చేపట్టడానికి అవసరమయ్యే మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో పళనిస్వామికి ఇప్పట్లో వచ్చే నష్టమేదీ లేదని తెలుస్తోంది.


తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి శుక్రవారం ఉదయం బెంగళూరుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో కర్నాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిసేందుకు ఆయన వెళతారని సమాచారం. శుక్రవారం ఉదయం పది గంటలకు శశికళను కలవనున్న ఆయన పలు అంశాలపై ఆమెతో నిశితంగా చర్చిస్తారని, సోమవారం బల నిరూపణకు సంబంధించి చిన్నమ్మ సూచనలు ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శశికళను కలిసేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు మంత్రివర్గ సహచరులు కూడా వెళతారని తెలుస్తోంది.