21,22 తేదీల్లో తిరుమలకు కేసీఆర్‌

Updated: Fri, Feb 17, 2017, 02:48 AM
 

 -మొక్కు తీర్చుకోనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌


 -వెంకన్నకు రూ. 5 కోట్లతో బంగారు ఆభరణాలు


 -పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక


 -ఈ దఫా విజయవాడ పర్యటన లేనట్టే


తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ఖరారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కోరిక సిద్ధిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఆభరణాలు చేయిస్తానని ఆయన మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కోరిక తీరడంతో, వెంకటేశ్వరుని దర్శనానికి రానున్నారు. 21 మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకునే కేసీఆర్‌, రాతక్రి తిరుమలలో బస చేసి, ఆపై 22న ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకుని ఆభరణాలను బహూకరించనున్నారు. ఆపై తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో అమ్మవారికి మొక్కులు చెల్లించి, అక్కడి నుంచి హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper