ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదాతోనే అభివృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2017, 02:45 AM

 బ్రూటస్‌ వని తెలుగు జాతి నిన్ను సంబోధిస్తోంది  బాబుపై జగన్‌ ధ్వజం


-ఉద్యోగాలొచ్చి మనం అభివృద్ధి చెందాలంటే హోదా ఒక్కటే బ్రహ్మాస్త్రాం  


-హోదాపై బాబు, వెంకయ్య వెన్నుపోటుకు రాష్ట్రం నివ్వెరపోయింది  


-కంపెనీ ప్రెస్‌నోట్లు ఇచ్చే పీఆర్‌ఓలతో బాబు ఎంఓయూలు చేసుకొన్నారు  


-గుంటూరు యువభేరీలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత


గుంటూరు, మేజర్‌న్యూస్‌ : రోమన్‌ చక్రవర్తి సీజర్‌ను తన స్నేహితుడు బ్రూటస్‌ కత్తితో వెన్నుపోటు పొడిచిన ప్పుడు ''యూ టూ.. బ్రూటస్‌'' అన్నాడని, ముఖ్య మంత్రి స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్‌ తెలుగుజాతి ``నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్ర నికి ప్రత్యేక హోదా కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడులో గురువారం నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాదు అనుకున్న తెలంగాణ రాషా్టన్న్రి వాళ్లు సాధించుకున్నారని పార్లమెంటు సాక్షిగా మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు సాధ్యం కాదని జగన్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జూన్‌, జూలై నెలల్లో మూడేళ్ల పాలన ముగుస్తుందన్నారు. అప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరిగే అప్పుడు తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని దేశం మొత్తం చూసేలా చేస్తారు అని జగన్‌ పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తే వాళ్లను స్వాతంత్య్ర సమరయోధులు అంటామని, రాష్ట్రం కోసం ఎవరైనా త్యాగాలు చేస్తే వాళ్లను అమరజీవులు అంటామని పేర్కొన్నారు. ఏ దేశమైనా, రాష్టమ్రైనా, గ్రామమైనా కుటుంబమైనా ఏం కోరుకుంటుందన్నారు. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు, నేటికంటే రేపు బాగుండాలనే కోరుకుంటారని చెప్పారు. దీన్నే ఆర్థికశాస్త్రంలో చెప్పాలంటే సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటారని పేర్కొన్నారు. ఇంతకుముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ, మరింత ప్రగతి సాధించడం దీని అర్థమని పేర్కొన్నారు. ప్రభుత్వం బాగుంటే పురోగతి బాగా కనిపిస్తుంది అది బాగోకపోతే వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుందన్నారు. హైదరాబాద్‌ నగరాన్నే మనం గమనిస్తే.. బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ ఫ్యాక్టరీలు, ఇక్రిశాట్‌, మిధాని, సీసీఎంబీ, ఐఐసీటీ, ఈసీఐఎల్‌, హెచ్‌ఎంటీ, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్‌, డీఎంఆర్‌ఎల్‌ ఇలా అనేక సంస్థలు కనిపిస్తాయన్నారు. హైదరాబాద్‌, చెనై్న, బెంగళూరు అన్నీ ఈ 70 ఏళ్లలో ప్రభుత్వాలు అందించిన తోడ్పాటుతో అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో నిలిచాయన్నారు. ఇప్పుడు ఈ నగరాలతో మనం పోటీ పడాల్సి వస్తోందిని ప్రభుత్వ సాయం లేకుండా ఎలా పోటీపడగలమని ఆయన ప్రశ్నించారు. రాషా్టన్న్రి ముందుకు తీసుకెళ్లపోతే 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.  సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలి, మరో మెట్టు ఎదగాలన్నారు. ఇలా ఎదగాలంటే దీనికి ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్కటి బ్రహ్మాస్త్రంగా తోడయితేనే ఇది సాధ్యం అవుతుందన్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వాలకు తెలియనివి కావు అని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలకు ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు కూడా హోదా గురించి మాట్లాడారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అంటే ఏంటన్న విషయానికి వస్తే అది మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావడమని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాషా్టల్రకు వెళ్లాల్సిన పరిస్థితి కాకుండా, ఉద్యోగాలే వేరే రాషా్టల్ర నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేక హోదా అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారని విమర్శించారు. తాను పోరాటం చేయకపోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్‌ చేస్తే, దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పిస్తారని బాబుపై ఆయన ధ్వజమెత్తారు.   జనవరి 26న కొవ్వొత్తులతో రాష్టవ్య్రాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు చేయాలని తలపెడితే ఇదే చంద్రబాబు దగ్గరుండి ర్యాలీలో పాల్గొనకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్‌పోర్టులోనే రన్‌వే మీదే ఆపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మనం బస్సు రోకో, రైల్‌ రోకో చూసి ఉంటాం గానీ విమానాల రోకో కూడా చంద్రబాబు హయాంలో తొలిసారి చూశామన్నారు. ఇదే 2015లో అయితే 21,300 కోట్ల ఐఈఎంలు ఫైల్‌ చేశారు 2014లో 21,526 కోట్లు ఫైల్‌ అయ్యాయని, వీటిలో ఎన్ని ఇంప్లిమెంట్‌ అయ్యాయంటే, 2014లో 2,804 కోట్లు మాత్రమే. 2015లో రూ. 4,542 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.  దీన్ని బట్టి చూస్తే 2016 సంవత్సరానికి మహా అయితే మరో 7వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వస్తాయన్నారు. చంద్రబాబు ఇంతలా అబద్ధాలు చెబుతుంటే, మోసాలు చేస్తుంటే ఈ పెద్దమనిషిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదన్నారు.  2016లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇంత మోసం చేసి, 2017లో ఇంకా పెద్దమోసం చేయడానికి సిద్ధమయ్యారు పేర్కొన్నారు. 2017 జనవరిలో ఏకంగా 10.54 లక్షల కోట్ల ఎంఓయూలు సంతకాలు చేశామంటూ అబద్ధాలు మొదలుపెట్టారన్నారు. ఆయన ఎవరికి పడితే వాళ్లకు సూటు, బూటు వేసి, వాళ్లతో ఎంఓయూలు చేసేసుకున్నారని విమర్శించారు. త్రిలోక్‌ కుమార్‌ అనే వ్యక్తి చంద్రబాబుతో ఎంఓయూ సంతకం చేశారని, ఈయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారని చెప్పారు. ఈయన చేసే పని పారిశ్రామిక వేత్త గంధం నందకుమార్‌ వద్ద నుంచి ప్రెస్‌నోట్లు తెచ్చి, విలేకరులకు ఇస్తారని జగన్‌ పేర్కొన్నారు. అంటే కంపెనీ పీఆర్వో అని పేర్కొన్నారు. ఇతడికి సొంత వాహనం కూడా లేదని ఈ మనిషి మొన్న చంద్రబాబుతో ఎంఓయూ చేసుకున్నారన్నారు. రాష్ట్రం బాగుండాలని, పెట్టుబడులు రావాలని అందరూ ఆశిస్తామని ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఎవరితో పడితే వాళ్లతో ఎంఓయూలు చేసేసి 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబుతుంటే బాబు ప్రభుత్వంలో సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ అన్న పేరుతో పారిశ్రామిక శాఖ కార్యదర్శిగా ఆయన అసలు సంతకాలు పెట్టనని నిరాకరించారని గుర్తుచేశారు.  వీటి జనాభా కేవలం 7.5 కోట్లు  2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఇది 6.5 శాతం, ఈ రాషా్టల్రకు రూ76980 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారని గుర్తుచేశారు. మిగిలిన 93.5 శాతం జనాభాకు 186820 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారని   అంటే, 6.5 శాతం జనాభాకు 30 శాతం గ్రాంటులు ఇస్తున్నారన్న మాట అని హోదా ప్రయోజనాలను జగన్‌ వివరించా రు. పక్కన బెంగళూరు, చెనై ్న, హైదరాబాద్‌లతో ప్రత్యేక హోదా లేకుండా వాటితో మనం ఎలా పోటీ పడలేమని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా అన్నది ఒక్క జగన్‌ మాత్రమే పోరాడితే సాధ్యమయ్యే పనికాదు మనం అడగడం మానేస్తే ప్రత్యేక హోదా అడిగేవాడు ఎవ్వరూ ఉండరని ఆవేదనవ్యక్తంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com