జగన్‌ కూడా జైలుకే

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 02:38 AM
 

రాయలసీమకు శ్రీశైలం మిగులు జలాలు


 -లక్షల కోట్ల ప్రజాధనం కొట్టేసిన వ్యక్తి బయట ఉండలేడు  


 -అభివృద్ధే మా లక్ష్యం  కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం 


 -ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  


 -సొంత నియోజకవర్గంలో పర్యటన కుప్పంలో పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరు


అక్రమాస్తుల కేసులో శశికళ 20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లిందని, రూ.40వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్‌ కూడా జైలుకు వెళ్లాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవ ర్గంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమా వేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని, వారి సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు.


చిత్తూరు నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి :  శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందిస్తున్నామ న్నారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆద ర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు గురువారం తన సొంత నియో జకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటించారు. తన వ్యక్తగత కార్యదర్శి మనోహర్‌ కుమార్తె వివా హానికి హాజరైన చంద్రబాబు నాయుడు గురువారం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. అనంతరం పలమనేరు ఎమ్మెల్యే అమర నాథరెడ్డి కుమారుడి వివాహానికి హాజరవ్వను న్నారు. అక్కడి నుంచి సీఎం విశాఖ చేరుకుం టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున చంద్రబాబు పలు అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖకు వచ్చారు.  రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40గంటలకు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ ఉక్కులోని ప్రగతి మైదానానికి వెళ్లి అక్కడ పెందుర్తి శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత సీఎం నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యే విమానంలో 8.20గంటలకు బయలుదేరి విజయవా డకు వెళ్లారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందువల్ల జిల్లా అధికారులు సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. పోలీసు యంత్రాంగం మాత్రం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించింది.