ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరగాళ్ల కళ్లు పీకేసే దమ్ము సీఎంకు ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2017, 01:41 AM

 -ఆ ధైర్యం మహిళా సమాజానికి బాబు ఇవ్వలేకపోతున్నారు


 -విద్యార్థులతో ముఖాముఖీలో వై.ఎస్‌.జగన్‌


గుంటూరు, మేజర్‌న్యూస్‌: యువభేరీ సభకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని అక్కడికి విచ్చేసిన కొందరు విద్యార్థులు పలు ప్రశ్నలు వేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ అని వారు అడిగారు. గురువారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన (గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ నిరాహార దీక్ష చేసింది ఇక్కడే) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనకై యువభేరి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత అభిప్రా యాలను అడిగి తెలుసుకొన్నారు. ఆడవారి విషయం లో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను బీటెక్‌ విద్యార్థిని వినీలా అడిగిన ప్రశ్నకు జగన్‌ సమాధానమిస్తూ స్పీకర్‌ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయనను ప్రశ్నించాలి చేసిన తప్పును సరిదిద్దాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం వత్తాసు పలికారని ఆరోపించారు. వంట చేసుకుంటూ ఉంటే ఆడవాళ్లపై రేప్‌లు జరగవని అనడం దారుణమన్నారు. ``రాత్రి 12 గంటలకు బయటకు వెళ్లినా రక్షిస్తానని ఒక ముఖ్యమంత్రి చెప్పగలగాలి. ఎవరైనా మహిళలను తప్పుగా చూస్తే కండ్లు పీకేస్తాం అని చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉం డాలి. (ఈసమయంలో యువత చప్పట్లు, ఈలలు). కానీ, టీడీపీ ప్రభు త్వ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి, సాక్షాత్తు ప్రభుత్వ అధికారిణిపై చేయి చేసుకున్నా పట్టించుకోలేదు, రిషితేశ్వరి విషయంలో ఒక్క కేసు పెట్టలేదు. విజయవాడలో ఉంటూ సెక్‌‌సరాకెట్‌ వారికి అనుకూలంగా మాట్లాడారు, అంగన్‌ వాడీలకు తోడు ఉండాల్సిం ది పోయి ఇష్టం వచ్చినట్లు చేశారు, మొన్న ఏపీ పోలీసు బాస్‌ మహిళలపై 11శాతం నేరాలు పెరిగాయని చెప్పారు, అసలు ఇలా చెప్పడానికి ఏపీ ప్రభుత్వానికి సిగ్గుందా, నీ ప్రశ్న చూసైనా మహిళల విషయంలో చంద్ర బాబు ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాను'' అని జగన్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి అవసరం లేదంటూనే గల్లా జయ దేవ్‌, సీఎం రమేశ్‌, సుజనా చౌదరీలాంటి నాయకులు ప్రత్యేక హోదా కలిగిన ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే మనదగ్గరికి కూడా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తాయి కదా అంటూ  బీటెక్‌ విద్యార్థి వెంకట్‌ అడిగిన ప్రశ్నకు జగన్‌ స్పందిస్తూ ``పెట్టుబడులు రావడమే కాదు మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి, మనమే పక్క రాషా్టల్రకు కూడా ఇవ్వగలిగే ఉద్యోగాలను సృష్టించగలం కూడా, ప్రత్యేక హోదా వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి, ఈ విషయం నీ ప్రశ్నతోనైనా చంద్రబాబుకు బోధపడుతుందని అనుకుంటున్నాను'' అని జగన్‌ వ్యాఖ్యానించారు.    కానీ, ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బీటెక్‌ విద్యార్థిని శ్రీ విద్య అడిగిన ప్రశ్నకు జగన్‌ స్పందిస్తూ ``కోట్లలో నల్లడబ్బు అడ్డదారిలో ఇస్తూ ఓటుకు నోటు కేసులో ఆడియోలకు, వీడియోలకు దొరికిపోయినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com