ఏపీలో సచివాలయం వద్ద డ్రోన్ కలకలం నెలకొన్నట్లు ప్రచారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కలెక్టర్ల సదస్సు జరుగుతున్న వేళ సోషల్ మీడియాలో డ్రోన్ సంచారం అంటూ వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారాలపై విచారణ చేపట్టిన పోలీసులు, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినట్లు గుర్తించారు. దిల్లీ నుంచి విజయవాడకు వస్తున్న ఓ విమానాన్ని డ్రోన్‌గా చూపిస్తూ అపోహలు సృష్టించినట్లు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సు ప్రాధాన్యతను తగ్గించేందుకు కావాలనే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa