రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా శనివారం కర్నూలు జిల్లా ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కపటి గ్రామంలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆపరేషన్లో అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, చట్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa