ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్.. బాలిక ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 01, 2026, 03:39 PM

AP: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామానికి చెందిన అవంతి టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య పాల్పడింది. బాలిక మృతిపై ఎమ్మెల్యే శ్యాంబాబు విచారం వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పరీక్షల్లో ఓటమిపై విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, మళ్లీ విజయం సాధించవచ్చని ఆయన సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa