ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకుల్ని కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేటలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్లపై ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa