అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా, గుంటూరు కలెక్టర్ కొత్త ప్రకటనలు జారీ చేశారు. భూ సమీకరణకు కొంతమంది రైతులు అంగీకరించకపోవడంతో, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 9 గ్రామాల్లో 383.75 ఎకరాల భూమిని సేకరించడానికి నోటీసులు జారీ చేశారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం ఈ భూములు అవసరమని అధికారులు తెలిపారు. ఇప్పటికే మంత్రి నారాయణ పలుమార్లు భూ సమీకరణ ద్వారా భూములు ఇవ్వాలని రైతులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa