పల్నాడు జిల్లా మాచర్లలో మంగళవారం జరిగిన ముదిరాజ్ కులస్థుల సమావేశంలో, పల్నాడు జిల్లా యువత అధ్యక్షులు మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ముదిరాజ్‌లు కులవృత్తి లేకుండా సంచారజీవనం ద్వారా జీవనం కొనసాగిస్తున్నారని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న తమకు రాజకీయంగా చట్టసభల్లో కనీసం ఒక స్థానం కూడా లేదని, ఈ అవకాశం రావాలంటే చాలా దూరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు, కులబంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa