AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. గురువారం 64,136 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,255 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa