శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ విడుదలయ్యింది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎం. అనురాధ గురువారం ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. 2020-21, 2021-22, 2022-23 అడ్మిట్ అయిన బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa