భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, ఈనెల 14న ఎమ్మిగనూరులో భారీ వేడుకలు నిర్వహించేందుకు జయంతి ఉత్సవ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంగళవారం కరపత్రాలను విడుదల చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి దళిత, గిరిజన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ కన్వీనర్ యస్. దేవసహాయం, చైర్మన్ డాక్టర్ ఎర్రకోట సంకుల మహాలింగప్ప పిలుపునిచ్చారు. వందలాది డప్పులతో దరువు కార్యక్రమం, యువకుల కర్రసాము విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa