AP: అమరావతి రాజధాని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు పొడిగించింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో పాల్గొన్న రైతులకు ఈ సడలింపు వర్తించనుంది. దీంతో భూముల మార్పిడి, ప్లాట్ల కేటాయింపులపై వచ్చే పన్ను భారం తగ్గనుంది. రైతుల ఆర్థిక భద్రతకు ఇది మేలు చేయడంతో పాటు రాజధాని అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa