కంకిపాడు మండలం చలివేంద్రపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలల్లో జరిగిన సమగ్ర అభివృద్ధిని వివరించడానికి, గ్రామ సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కూటమి నాయకులు, అధికారులు గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, రెండో విడత పల్లె పండుగలో భాగంగా అభివృద్ధికి అంచనాలు వేయడానికి గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa