ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనగణన-2027 ప్రక్రియలో పొరపాట్లు జరగకూడదు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 03:03 PM

కర్నూలు నగరంలో గురువారం సీఐటీయూ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ, బీడీ వర్కర్స్ కాలనీలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లపై పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 45వ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, కాలనీవాసులు, కార్మికులు పాల్గొని పేదలకు కట్టిన ఇళ్లపై మున్సిపల్ వసూలు చేస్తున్న పన్నులను రద్దు చేయాలని, సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అందించాలని కోరారు. అదనంగా పార్కులు, రోడ్లు, మురుగు కాలువలు అభివృద్ధి చేయకపోవడాన్ని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa