విజయవాడ : పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమీలేదు. జిల్లా కేంద్రంలో రోజుకో చోట డ్రైనేజీ లీకేజీలతో ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహిస్తున్నది. విజయవాడ లోని కానూరు గ్రామ పరిధిలోని సూపర్ విజ్ రోడ్ సమీపంలో గల శ్రీ వికాస్ స్కూల్ యాజమాన్యం అక్రమంగా మురుగు నీటిని బయటకు వదిలి వేయడం వలన చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలు మరియు నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ని మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు తెలియపరచినా గడచిన వారం రోజులుగా ఎటువంటి చర్యలు చేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించడం చాలా బాధకారం అని స్థానికులు తెలిపారు. ఇండ్ల మధ్యలో చెత్తాచెదారంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ కంపుగా మారిపోతున్నాయి.తగు పరిష్కార చర్యలు తీసుకోవడంలో మున్సిపాలిటీల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ గుంటలలో పందులు కూడా తిరుగుతున్నాయి.పరిసరాల్లో మురుగు కంపుతోపాటు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ ప్రాంతమంతా బురదగా మారి, నీరు గుంటలుగా నిల్వ ఉండిపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పై నిలిచి ఉన్న మురుగు నీటిని తొలగించేలా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa