డుంబ్రిగూడ మండలంలోని అరకు మేజర్ పంచాయతీ సర్పంచ్ గుగ్గుడు శారదకు జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. ఈ నెల 11న ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శక్తి పంచాయత్ రాష్ట్రీయ నేతృత్వ అభియాన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మందిని ఎంపిక చేయగా, అల్లూరి జిల్లా నుంచి ఆదివాసీ మహిళా సర్పంచ్‌గా తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని సర్పంచ్ శారద తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa