అనంతపురం జిల్లా, కుందుర్పిలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులు లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి డేడ్‌లైన్ విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ ఇవ్వకపోతే ఏప్రిల్ 2 తర్వాత పరిపాలన స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, అవి ముగిసేలోగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రెన్యూవల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa