ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకామణిలో దొంగతనాలు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యం కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 10:04 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో అపచారాలు పెరిగిపోయాయని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2024 సెప్టెంబరు నుంచే పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య దొంగతనాలు చేస్తున్నా ప్రభుత్వం గుర్తించ లేకపోవడం భద్రతా వైఫల్యమేనని తేల్చి చెప్పారు. 2025 జనవరి 11న విజిలెన్స్ అధికారులు అతడ్ని పట్టుకున్నా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిందితుడికి వెంటనే బెయిల్ మంజూరు కావడంలో ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. గతంలో వైయస్ జగన్ హయాంలో చోరీకి గురైన ఆస్తులను తిరిగి టీటీడీకి రాయించగలిగితే. నేడు కూటమి ప్రభుత్వం దొంగలకు కొమ్ముకాస్తుందని" ఆక్షేపించారు. తిరుమల ప్రతిష్టను మసకబారుస్తున్న పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడిపై కాకాణి నిప్పులు చెరిగారు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు,  పరకామణి చోరీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలంటే... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa