ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2027 వరల్డ్‌కప్ లక్ష్యంగా శ్రీలంక.. కొత్త కోచ్‌గా Gary Kirsten నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 09:26 PM

భారత జట్టుకు 2011 ప్రపంచకప్ అందించిన మాజీ దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పుడు శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ఆయనను జట్టు ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ఆయన పదవీకాలం ప్రారంభం కానుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ కాంట్రాక్ట్ ప్రకారం కిర్‌స్టెన్ ఏప్రిల్ 14, 2028 వరకు ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు.ప్రధానంగా 2027 వన్డే ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టును బలంగా తయారు చేయడం ఆయన ముందున్న ముఖ్య లక్ష్యం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును సమగ్రంగా సిద్ధం చేయాలని బోర్డు భావిస్తోంది.ఇదే సమయంలో జాతీయ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను మరింత బలోపేతం చేయడం, యువ ఆటగాళ్ల ప్రతిభను పెంపొందించడం కూడా ఆయన బాధ్యతల్లో భాగంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో శ్రీలంక జట్టును మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.58 ఏళ్ల కిర్‌స్టెన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉంది. ఆయన కోచింగ్‌లో భారత జట్టు 2011 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అనంతరం ఆయన మార్గదర్శకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్లలోనూ నంబర్-1 ర్యాంక్‌ను అందుకుంది.ఇటీవల టీ20 ప్రపంచకప్ సమయంలో నమీబియా జట్టుకు కన్సల్టెంట్‌గా సేవలందించిన కిర్‌స్టెన్, ఇప్పుడు శ్రీలంక జట్టును మళ్లీ విజయపథంలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa