ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థుల్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి ప్రయాణం చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa