DMartలో బియ్యం, పప్పులు, వంటనూనె, సబ్బులు వంటి నిత్యావసర వస్తువులు 40 శాతం వరకు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. దీంతో వినియోగదారులు నెలసరి ఖర్చులో గణనీయమైన ఆదా చేసుకునే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించే రిటైల్ చైన్‌గా డీమార్ట్ ఇప్పటికే భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. గతంలో నెలవారీ సరుకుల కోసం హోల్‌సేల్ మార్కెట్లను ఆశ్రయించిన మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్లలోనే షాపింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు మాల్ సంస్కృతి ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండగా, దానిని సాధారణ ప్రజలకు చేరువ చేసిన సంస్థగా డీమార్ట్ నిలిచింది.డీమార్ట్ తక్కువ ధరల వెనుక ప్రధాన కారణం వారి ‘ప్రైవేట్ లేబుల్’ వ్యూహం. ప్రముఖ బ్రాండ్‌లతో పాటు తమ సొంత బ్రాండ్ ఉత్పత్తులను కూడా విక్రయించడం ద్వారా మధ్యవర్తుల ఖర్చులను తగ్గించి, వినియోగదారులకు తక్కువ ధరల్లో సరుకులు అందిస్తోంది. ఈ విధానం వల్ల ఇతర బ్రాండ్‌లతో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు ధరల్లో తేడా కనిపిస్తుంది.బియ్యం, పప్పులు, గోధుమలు, వంటనూనె వంటి ప్రాథమిక అవసరాల నుంచి బిస్కెట్లు, కాఫీ పొడి, కార్న్ ఫ్లేక్స్ వరకు అనేక ఉత్పత్తులు డీమార్ట్ లేబుల్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే సబ్బులు, డిటర్జెంట్లు, ఫ్లోర్ మరియు టాయిలెట్ క్లీనర్లు వంటి గృహ వినియోగ వస్తువులు కూడా తక్కువ ధరలకు లభిస్తున్నాయి. అదనంగా ‘ప్రీమియం’ బ్రాండ్ పేరుతో దుస్తులు, కొన్ని చిన్న గృహోపకరణాలను కూడా పరిచయం చేసింది. నాణ్యతను కాపాడుతూ ఖర్చులను నియంత్రించే వ్యాపార విధానం, మధ్యతరగతి వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకున్న ధర వ్యూహం — ఇవే డీమార్ట్‌ను దేశంలో అగ్రగామి రిటైల్ చైన్‌లలో ఒకటిగా నిలబెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa