ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. రైల్వే తాజాగా Rail Parcel Booking Appను బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఇప్పుడు కొత్త సౌకర్యాన్ని పొందవచ్చు. తక్కువ ఖర్చుతో పార్శిళ్లను పంపించుకోవడం, అలాగే పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు.ప్రస్తుతానికి ఈ రైల్ పార్షిల్ సేవలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. తొలుత హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడిన యాప్ విజయవంతం కావడంతో, దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. యాప్ ద్వారా పార్షిల్ బుకింగ్ చేయడం, డెలివరీ ట్రాకింగ్ చేయడం సులభం.వ్యాపారులకు కూడా ఈ యాప్ ద్వారా అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా పికప్ బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీ ఎప్పుడు జరిగిందో కూడా యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. పరిశ్రమలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో ఈ విప్లవాత్మక రైల్ పార్షిల్ యాప్‌ను అమలు చేసిన మొదటి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు పొందడం గర్వకారణం. ఈ యాప్ పార్షిల్ కార్యాలయాన్ని వినియోగదారుల దగ్గరికి తీసుకువస్తుంది. పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం, ఫారాలు పూరించాల్సిన సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది” అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa