ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:18 PM

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.గతేడాది జూలై 9న జరిగిన సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొనగా, ఈసారి అంతకంటే ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa