శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు CM చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు ఆహ్వానించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను ఆయనకు అర్చక స్వాములు అందించారు.శ్రీశైలంలో రేపటి(ఫిబ్రవరి 8) నుంచి ఈనెల 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నట్లు ఈవో తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 40 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa