కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు, పట్టణానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 57,96,755.00 రూపాయల చెక్కులను కదిరి పట్టణం ఆర్ అండ్ బి వసతిగృహం నందు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 410 మందికి గాను 3,58,94,050 రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa