వైసీపీ హయాంలో రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతీదాన్నీ తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో, నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.అయితే, చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa