AP: తిరుమల శ్రీవారిని రోజూ లక్ష మంది వరకు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రథసప్తమి వేడుకల సందర్భంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు, ఎన్ఆర్ఐల స్పెషల్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. అలాగే ఈ మూడు రోజులు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయబడుతుంది. రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, లడ్డూలు అందుబాటులో ఉంచడంతో పాటు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa