Motorola Signature స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ కావడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా, ఈ అప్‌కమింగ్ ప్రీమియం ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. 8K డాల్బీ విజన్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో మోటరోలా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్‌పై ఆసక్తి పెరిగింది. మరి ఇప్పటివరకు బయటపడ్డ లీక్ వివరాలు ఏంటో చూద్దాం.
Motorola Signature: లీక్డ్ ప్రైస్ : ఆన్లైన్ లీక్స్ ప్రకారం, మోటరోలా సిగ్నేచర్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధరను రూ.59,999గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక (16GB + 512GB) వేరియంట్‌ను రూ.64,999 ధరకు తీసుకురానున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి.అంతేకాదు, (16GB ర్యామ్ + 1TB స్టోరేజ్)తో కూడిన హైఎండ్ వేరియంట్ కూడా ఉండబోతోందని సమాచారం. ఈ టాప్ మోడల్‌ను రూ.69,999 ప్రైస్ ట్యాగ్‌తో లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఈ ఫోన్‌పై ఆఫర్ల వివరాలు కూడా లీక్స్‌లో వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా రూ.5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.7,500 ఎక్స్చేంజ్ బోనస్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ సంజూ చౌదరి ఈ వివరాలను లీక్ చేశారు. ఇవన్నీ నిజమైతే, మోటరోలా సిగ్నేచర్ ప్రీమియం సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చే ఫోన్‌గా నిలవనుంది.
*Motorola Signature: ఫీచర్స్ : మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే ఇవ్వనున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు అధిక బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. మొత్తంగా ఇది ఫ్లాగ్షిప్ స్థాయి డిస్ప్లే సెటప్‌గా చెప్పవచ్చు.పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్‌కు క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇది టాప్-ఎండ్ చిప్సెట్ కాగా, 16GB LPDDR5X ర్యామ్‌తో పాటు 1TB వరకు భారీ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత Hello UIతో రన్ అవుతుంది.కెమెరా సెక్షన్లో మోటరోలా సిగ్నేచర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP Sony LYT-828 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్ 8K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో పాటు సూపర్ రిజల్యూషన్ ఫోటోగ్రఫీ ఫీచర్లను కలిగి ఉంటుంది.బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5,200mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.అదనంగా, ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు ఉండటంతో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. ఆడియో విషయంలో Bose ట్యూనింగ్‌తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను అందించనున్నారు. మొత్తం మీద, మోటరోలా సిగ్నేచర్‌ను సూపర్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa