ఆదోని పట్టణ శివారులోని వై పీ ఆర్ కాలనీ సమీపంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద చిరుత పులి సంచరిస్తున్నట్లు కాలనీవాసులు గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి ఆలయ సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa