ఏపీ త్వరలో దేశ బొగ్గు ఉత్పత్తి చిత్రపటంలో స్థానం సంపాదించనుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పరిధిలోని రేచర్ల బ్లాకులో బొగ్గు తవ్వకాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ బ్లాకులో బొగ్గు వెలికితీత, గ్యాసిఫికేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.దేశవ్యాప్తంగా మొత్తం 41 బొగ్గు బ్లాకుల్లో ఉత్పత్తి లేదా గ్యాసిఫికేషన్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా 17 బ్లాకుల కోసం బిడ్లు సమర్పించాయి. అందులో ఏపీలోని రేచర్ల బ్లాక్ కూడా ఒకటి కావడం గమనార్హం.ఏలూరు జిల్లాలోని ఈ రేచర్ల బ్లాకులో అత్యంత నాణ్యమైన గ్రేడ్-1 బొగ్గు నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సుమారు 200 నుంచి 300 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిక్షేపాల ద్వారా ఏటా 8,000 మెగావాట్ల విద్యుత్‌ను దాదాపు 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తవ్వకాలు ప్రారంభమైతే రాష్ట్ర ఇంధన అవసరాలకు ఇది కీలకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa