AP: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని ఈనెల 8వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ధర్మకర్తల మండలి, ఆలయ ఈవో ప్రకటించారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు కూడా స్పర్శ దర్శనం అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు రూ.5వేల గర్భాలయ అభిషేకం, రూ.1500 సామూహిక అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa